hai

file:///C:/Documents%20and%20Settings/Shivaa/My%20Documents/Flash%20Banner%20Creator/output/mybanner.swf

Followers

Wednesday, December 2, 2009

3

1."ఏమిటి వదినా, మీ ఆయన ఏమిటేమిటో మాట్లాడేస్తున్నారు. ఒక్క ముక్క అర్ధం అయి చావడం లేదు.ఒక మాటకు ఇంకొక మాటకు లంకె వుండడం లేదు. ఏమైనా జబ్బెమో ఒకసారి డాక్టరుకు చూపించలేకపోయావా ?" అయోమయం గా అడిగింది అనసూయ.
" జబ్బేమీ లేదు వదినా. ఆయన ఈ మధ్య కవితలు రాయడం మొదలెట్టారు. అప్పట్నుంచీ ఇదీ వరస." అసలు సంగతి చెప్పింది అరుంధతి.
(2)"డ్రైవర్ ఉద్యోగానికి వచ్చిన దైవాధీనాన్ని ఇంటర్వూ చేసి బాగా ఉద్యోగానికి సరిపోతాడను రూఢీ చేసుకున్నాక " నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాం.అయితే స్టార్టింగ్ శాలరీ రెండు వేలు " అని చెప్పాడు గోవర్ధనం.
"స్టార్టింగ్ చేయడానికి రెండు వేలు అయితే డ్రైవింగ్ చేయడానికి ఎంత శాలరీ ఇస్తారు సార్ ? " ఆశగా అడిగాడు దైవాధీనం
1. మొగుడూ పెళ్ళాళయిన సీతా, రామారావు ఒకరోజు తీవ్రం గా గొడవ పడ్దారు. ఎప్పటికీ మొగుడు కాళ్ళు పట్టుకోకపోవడం వలన గబ గబ కొన్ని బట్టలను సర్దేసి బయటకు నడవబోతోంది సీత.
" ఎక్కడికి పోతున్నావు ? " అడిగాడు రామారావు.
" నరకానికి" విసురుగా సమాధానమిచ్చింది సీత.
అయితే నిన్ను నాకు తగిలించి అక్కడకు పోయిన నా అత్తమామలకు నా నమస్కారాలు చెప్పు" వ్యంగ్యం గా అన్నాడు రామారావు.
2. డాక్టర్ గారూ. తీవ్రమైన అలసటగా వుంటోంది. దయచేసి టేస్టు చెయ్యండి" అడిగాడు సుబ్బారావు.
డాక్టర్ అన్ని పరీక్షలు చేసి "మీరు చాలా వీక్ గా వున్నారండి. ఈ మందులను వాడండి క్రమం తప్పకుండా వాడండి, దానితీ పాటు బాగా రెస్టు తీసుకొండి" అని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు.
" ఓ కె డాక్టర్ అయితే రేపట్నుంచి ఆఫీసుకు వెళ్ళడం ప్రారంభిస్తాను.అక్కడయితే పగలు కూడా బాగా నిద్రపోవచ్చు" అని భారం గా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు సుబ్బారావు.
"ఆ అంటూ నోరు తెరుచుకొని వుండిపోయాడు డాక్టర్.

1

1. "ఒరేయ్ రామూ, నేను మీ నాన్నగారికి రెండు వేల రూపాయలు అప్పు ఇచ్చి నెలకు రెండు వందలు చొప్పున తీర్చమన్నాననుకో అప్పుడు ఎన్ని నెలలలో నేను ఇచ్చిన అప్పు తీరుతుంది ?" అడిగింది లెక్కల టీచర్.
"అసలు తీరదు మేడం" అన్నాడు రాము." ఇంత చెప్పీనా నీ బుర్రకు ఏమీ ఎక్కడం లేదు.నీకు లెక్క అసలు అర్ధమవుతున్నాయా లేవా ? కోపంగా అడిగింది టీచర్." మీకే మా నాన్న తత్వం అర్ధం కాదు మేడం. అప్పు చేయడమే గాని తీర్చే బుద్ధి మా నాన్నగారికి అసలు లేదు" అసలు సంగతి చల్లగా చెప్పాడు రాము.
2. " నిన్ను ఇంతకాలం వెంట పడి ప్రేమా దోమా అంటూ వేధించిన ఆ రమేష్ నే పెళ్ళి చేసుకుందామని ఎందుకు నిర్ణయించుకున్నావో ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావదం లేదు " అడిగింది రోజా.
" ఇంత కాలం నా వెంటపడి నన్ను వేధించిన ఆ వెధవను పెళ్ళి చేసుకొని ప్రతీకారం తీర్చుకుంటాను. ఇక బ్రతికినంతకాలం వాడి బ్రతుకు కుడితిలో పడిన ఎలకే !క్షణం క్షణం కష్టాలు అనుభవిస్తూ బ్రతుకుతూ చస్తాడు దొంగ వెధవ " అసలు సంగతి చెప్పింది అయేషా.