ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటినుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టపడక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యదావిధిగా ఏప్రిల్ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటపట్టించేవారు. అంతేకాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపలక్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్ ఫిష్ అంటూ అల్లరి పెట్టేవారు.
ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్ ఫూల్స్ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమెరికా, బ్రిటన్, స్కాట్లండ్ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచమంతా ప్రాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రాన్రానూ ప్రాక్టికల్ జోక్స్ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ ప్రాక్టికల్ జోక్స్ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతి మించడం జరుగుతూ ఉంది. ఏది ఎమైనా సరదాగా, సంతోషంగా జరుపుకునే ఈ వేడుక మన దేశంలోనూ మారుమూల గ్రామాల్లోనూ జరుపుకుంటుండడం విశేషం.
No comments:
Post a Comment